భండనము

 

ఏప్రిల్ 17, 2023

భండనము    (bhanḍanamu)

    అర్థము

   (విశేష్యము): యుద్ధము; కవచము; చెడ్డ పని  

   Meaning

   (noun) : battle; armour; wicked/cruel deed

   వాడుక / Usage

వాలి దుందుభిల భీకర భండనం పలు దినములు కొనసాగింది.
Vaali & Dundhubi's fierce battle lasted for a few days.

   మెదడుకు మేత / Food for thought

కూర్చుండ మా యింట కురిచీలు లేవు
నా ప్రణయాంకమే సిద్ధ పరచనుంటి
పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు
నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి
పూజకై మా వీట పుష్పాలు లేవు నా
ప్రేమాంజలులె సమర్పింప నుంటి
నైవేద్య మిడ మాకు నారికేళము లేదు
హృదయమే చేతి కందీయనుంటి

లోటు రానీయ నున్నంతలోన నీకు
రమ్ము! దయసేయు మాత్మ పీఠమ్ము పైకి
అమృత ఝురి చిందు నీ పదాంకముల యందు
కోటి స్వర్గాలు మొలపించుకొనుచు తండ్రి!
-- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి (ఆగష్టు 4, 1912 - 1992)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి