తూణము
ఏప్రిల్ 18, 2023
తూణము (tūṇamu)
అర్థము
(విశేష్యము): తూణీరము; అమ్ములపొది; శరనిధి; బాణములు ఉంచే ఒర
Meaning
(noun) : quiver; container for arrows
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
ప్రాణేశ! నీమంజుభాషలు వినలేని
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?
కర్ణరంధ్రంబుల కలిమి యేల?
పురుషరత్నమ! నీవు భోగింపగాలేని
తనులత వలని సౌందర్యమేల?
భువనమోహన! నిన్ను బొడగానగాలేని
చక్షురింద్రియముల సత్వమేల?
దయత! నీయధరామృతంబానగాలేని
జిహ్వకు ఫలరససిద్ధి యేల?
నీరజాతనయన! నీ వనమాలికా
గంధమబ్బలేని ఘ్రాణమేల?
ధన్యచరిత! నీకు దాస్యంబు సేయని
జన్మమేల యెన్ని జన్మములకు?
-- రుక్మిణీ కళ్యాణం, ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)
Comments
Post a Comment