గడగట్టు
ఏప్రిల్ 19, 2023
గడగట్టు (gadagattu)
అర్థము
(క్రియ): ప్రతిష్ఠించు; నిర్ధారించు; జండాకట్టు; ధ్వజమెత్తు
Meaning
(verb) : to fix/determine; establish; raise a banner/flag
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
నేను ఏవో యతిప్రాసలు లేని పద్యాలు వ్రాస్తూండడం చూచి మా నాన్నగారు నాకు సులక్షణసారం కొనిపెట్టారు. ఛందస్సులో మొదటిపాఠం చెప్పారు. అప్పటికి నాకు ఏడెనిమిది సంవత్సరాలకు మించి ఉండదు. ఆ రోజు నుండి ఎన్ని పద్యాలు వ్రాశానో చెప్పను, అన్నీ తప్పులే! కాని ఒకసారి చేసిన తప్పు మళ్లీ చెయ్యలేదు. అందరూ నా తప్పులు దిద్దేవారే! కొన్ని తప్పులు నాకు తప్పుగా తోచలేదు. అవి చెయ్యడానికి నాకేదో హక్కు ఉందనిపించింది. అందువల్ల నా వ్యక్తి చైతన్యం ప్రగాఢతరం అవుతున్నట్లు, నా బలం హెచ్చినట్లు నాకు స్పష్టంగా తోచింది!
-- శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment