అజాండము
ఏప్రిల్ 20, 2023
అజాండము (aj-ānḍamu)
అర్థము
(విశేష్యము): అజ=బ్రహ్మ, అండము=గ్రుడ్డు; బ్రహ్మాండం; ప్రపంచం; విశ్వం
Meaning
(noun) : the universe
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
కారుమబ్బుల బారు సేరునేలెడి తీరు
కోరమీసము పొందు కొరుకొందు
మృగరాజు జాలునే తెగనొడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భారము
ఆదిశేషుడా, కూర్మమా, కాదు కాదు
అష్టదిగ్గజ కూటమా? అదియు కాదు
కోరమీసము పొందు కొరుకొందు
మృగరాజు జాలునే తెగనొడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలిరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు
ఎవరు మోయుచున్నారు ఈ అవని భారము
ఆదిశేషుడా, కూర్మమా, కాదు కాదు
అష్టదిగ్గజ కూటమా? అదియు కాదు
-- మీసం పై సీసం - కులగోత్రాలు, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment