వేదండము

 

ఏప్రిల్ 21, 2023

వేదండము    (vedanḍamu)

    అర్థము

   (విశేష్యము): ఏనుగు; గజము

   Meaning

   (noun) : elephant

   వాడుక / Usage

బాహుబలి చిత్రంలో వేదండము తొండము పైకి ఎక్కి మీద కూచున్న ఘట్టం అమోఘం.
Bahubali walking up the trunk of an elephant and riding it, is a spectacular scene.

   మెదడుకు మేత / Food for thought

తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జ్ఞానపధం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణుపధం
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

అరిషడ్వర్గము తెగనరికె హరి ఖడ్గమ్మిది నందకము
బ్రహ్మ లోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముగ పూబంతిల చేబంతిగ ఎగసి
నీరదమండల నారద తుంబుర మహతీదాసుల మహిమలు తెలిసి
శితహిమ గంధర యతిరాజస్సభలో తపః ఫలమ్ముగ తలుకుమని
తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాశయమ్ములో
ప్రవేశించె ఆ నందకము నందనానంద తారకము
అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం

పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడె ఉసురు పోయగ
విష్ణుతేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై
అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ

పాపడుగ నట్టింట పారుతు భాగవతము చేపట్టెనయ
హరినామమ్మును ఆలకింపక అరముద్దలనె ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతిగ
యద లయలొ పద కవితలు కలయ
తాళ్ళపాకలో యెదిగె అన్నమయ
తమసోమ జ్యోతిర్గమయా తమసోమ జ్యోతిర్గమయా

-- అన్నమయ్య, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి