మంజు

 

ఏప్రిల్ 24, 2023

మంజు    (manju)

    అర్థము

   (విశేష్యము): మనోహరమైనది; ఇంపైనది

   Meaning

   (noun) : pleasing; beautiful; delightful

   వాడుక / Usage

"ప్రాణేశ! నీ మంజుభాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమి యేల?".
Lord of my life! Of what use are these ears that can't hear your beautiful words.

   మెదడుకు మేత / Food for thought

మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ఏదీ ఎక్కడా ‘మాటవరసకి’ కూడా లేక, తెలుగుభాష నిరుపేదగా మారి, నడి వీధుల్లో పడుతున్న సమయంలో, వేటూరి గారిలోని ‘వాచస్పతి’ మనకి సంస్కృతసత్సంగంతో పరిపుష్ఠమై, గాంభీర్యంలోనూ గహనత్వంలోనూ విస్తృతిలోనూ సౌందర్యంలోనూ మరే ఇతర భాషకి అందనంత ఎత్తులో ఊన్న ఆంధ్రభాషతో పునః పరిచయం కలిగించే ప్రయత్నం చేసారు. అది కూడా ప్రజాబాహుళ్యానికి చేరువగా ఉన్న వెండితెర వేదిక ద్వారా.

కావ్యభాష, సినిమాని చిన్నచూపు చూస్తూ తనని తనే ‘వెలి’ వేసుకున్న తరుణంలో వేటూరి గారి పుణ్యమా అని తెలుగుపాట ఉన్నత స్థాయిలో పలకడం నేర్చుకుంది. అంతకుమునుపు పౌరాణికాల్లోనూ, ఏవో కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప తెలుగు సినిమా కవులు అందరికీ అందుబాటులో లేనంత జటిలమైన, సంస్కృత సమాస భరితమైన భాష జోలికి పోలేదు. ఆ కవులకి శక్తి, అర్హత, సామర్థ్యం లేక పోవడం వల్ల కాదు – సినిమా తెరని కృష్ణదేవరాయుల భువన విజయ మండపంగా మార్చే స్వేచ్ఛా, చొరవా తీసుకోక పోవడం వల్ల. అలాని అంతకుమునుపెప్పుడూ ఘనమైన భాషా పాటవాన్ని ప్రదర్శించిన పాటలు అస్సలు లేవని కాదు. కాని, వేటూరిగారు ఈ విషయంలో చాలా ముందుకి దూసుకువెళ్ళారు. అవకాశాన్ని అంది పుచ్చుకుని మరీ భాషని వినియోగించుకున్నారు
-- "వెండితెరని నల్లబల్లగా మార్చి తిరిగి తెలుగు ఓనమాలు దిద్దించిన వేటూరి", సిరివెన్నెల సీతారామ శాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి