సత్వము

 

ఏప్రిల్ 25, 2023

సత్వము    (satvamu)

    అర్థము

   (విశేష్యము): సత్తువ; దేహబలం; స్వభావము; మనస్సు; ఒక గుణము

   Meaning

   (noun) : existence; nature; strength; highest of three Gunas

   వాడుక / Usage

"భువనమోహన! నిన్నుఁ బొడగానఁగా లేని చక్షురింద్రియముల సత్వ మేల?".
O most charming one! What use is the existence of these eyes that can't see you?.

   మెదడుకు మేత / Food for thought

ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాథ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా అతను చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాథ కృతిలో అతనుదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్షణ్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం – ఈ వ్యక్తిత్వం.
-- సాహిత్య విమర్శకులు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం (సెప్టెంబర్ 10, 1935 - 2006)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి