బానము
ఏప్రిల్ 26, 2023
బానము (baanamu)
అర్థము
Meaning
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
కవిత్వాన్ని, ముఖ్యంగా తెలుగు కవిత్వకన్యల్ని చూస్తే చెలానికి Impatience, అనుమానం. శబ్ద సౌందర్యంతో తృప్తిపడి సంతోషించవలసిందే కాని, చెప్పే దానికి అర్థం వెదకటం అవివేకం అని. కాని నీరసపు కళాచతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూచి సంతోషించీ, విచారించీ, తప్పుకోడం చెలానికి చాతకాదు. తాను చెప్పదలచుకున్న సంగతి తనకే స్పష్టంగా తెలీనప్పుడు తన చాతగాని తనాన్ని, అర్థ అస్పష్టతనీ ఛందస్సు చీరల వెనకా, అలంకారాల మధ్యా, కఠిన పదాల బురఖాలలోనూ దాచి మోసగించాలని చూస్తాడు కవి - ముఖ్యం, సహజ సౌందర్యం తక్కువైనప్పుడు! సులభంగా, సూటిగా చెప్పేసి, ఇంత ధ్యానానికీ, మౌనానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వరాదా అని చెలం కోర్కె. ఆ పని స్త్రీలూ చెయ్యరు, దేశనాయకులూ చెయ్యరు. కవులూ చెయ్యరు - ఎంకీ, శ్రీ శ్రీ తప్ప. కవిత్వంలోనూ జీవితంలోనూ, Economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా.
తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వ మంటాడు చెలం. అందువల్లనే దిక్కుల్ని, దేవుల్ని, అధికారుల్ని వూగించి ప్రశ్నించే శ్రీ శ్రీ పద్యాలు అంత అభిమానం చెలానికి. నెత్తురూ, కన్నీళ్ళూ తడిపి కొత్త Tonic తయారు చేశాడు శ్రీ శ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి.
Comments
Post a Comment