ఘ్రాణము

 

ఏప్రిల్ 28, 2023

ఘ్రాణము    (ghrāṇamu)

    అర్థము

   (విశేష్యము): ముక్కు; వాసనచూచుట

   Meaning

   (noun) : nose; smell

   వాడుక / Usage

"న్యచరిత! నీ వనమాలికా

గంధ మబ్బ దేని ఘ్రా మేల?"

O accomplished one! What use is this nose that can't smell your garland of flowers?

   మెదడుకు మేత / Food for thought

ఆ కాలం వేరు. తగుమాత్రం చదువుకుని ఇంటిపట్టున నివసించే ఆడవాళ్ళు, ఇంకా కళాశాలలకి వెళ్ళి చదువుకునే అమ్మాయిలు, నెమ్మదితనం ఉండిన కొందరు మగవాళ్ళు–వీళ్ళందరికీ సరిపడా పని, మరింకాస్త ఎక్కువ తీరిక ఉంటూండే కాలం. మధ్యతరగతి జీవనంలో పెద్ద కుదుపులు లేని కాలం. రేడియో నింపని వేళల్లో హాయిగా చదువుకునే కాలం.

తెలుగు వచన సాహిత్యం చదువరులను సమీపించి అటూ ఇటూగా అప్పటికి పాతికేళ్ళు. మొదటితరం రచయితలకు ప్రాసంగికత కాస్త తగ్గుముఖం పడుతూ ఉంది. కొత్తగా రాస్తూన్న మగవాళ్ళ రచనలు ఆడవాళ్ళ మనసులకి కొంచెం అవతల ఆగుతూన్నప్పుడు–శూన్యమని కాదు గాని, మధ్యన జాగా వచ్చింది. వెళ్ళి అక్కడ స్త్రీలు కూర్చోవటం మొదలైంది. అందులో ఇద్దరు యువతుల కుర్చీలు ప్రత్యేకమైనవి: ఒకటి నల్ల విరుగుడు చేవది. నగిషీలు చెక్కిన నిగనిగ. కాలం గడిచేకొద్దీ బిగింపు సడలింది–ఊగిసలాట, అస్పష్టతలోకి. అయినా లోటేమీ లేదు, ఆ ఆసనం లతగారిది.

రెండోది మంచి పకడైన టేకు కుర్చీ. అందులోకి మెత్తటి దిళ్ళూ చుట్టూ రంగు రంగుల తోరణాల పూమాలల సొగసు–రాను రాను అది ఒక సింహాసనమైంది, యద్దనపూడి సులోచనారాణిగారికి. ఆ అరవైల నుంచీ ఇరవై అయిదేళ్ళపాటు ఆవిడ రాజ్ఞి.
-- కలలు ఇచ్చిన బలిమి, మైథిలి అబ్బరాజు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి