కదంబము
ఏప్రిల్ 04, 2023
కదంబము (kadambamu)
అర్థము
(విశేష్యము): మిశ్రమము; గుంపు; సముదాయము; తెల్ల ఆవాలు; కడిమి; రకరకాల పూలతో కట్టిన దండ; దప్పళం
Meaning
(noun) : mixture; group; garland of various flowers; hot & sour, veg & lentil soup!
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
పరనారీ సోదరుడై
పరధనముల కాసపడక పరులకు హితుడై
పరుల దనుబొగడ నెగడక
పరులలిగిన నలుగనతడు పరముడు సుమతీ!
(పరస్త్రీలపట్ల సోదరుడిలా మెలగి, ఇతరుల ధనానికి ఎంతమాత్రం ఆశపడక, తోటివారంతా తనను ఇష్టపడేలా ప్రవర్తిస్తూ, ఎదుటివారు పొగుడుతుంటే ఉప్పొంగిపోక, ఎవరైనా కోపగించుకొన్నప్పుడు తాను కూడా అదే పంథాలో ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ఉత్తమగుణాలను కలిగివున్నవాడే శ్రేష్ఠుడుగా గుర్తింపబడతాడు)

-- సుమతీ శతకం, బద్దెన (~ 1260)
Comments
Post a Comment