శమనము
మే 01, 2023
శమనము (ṣamanamu)
అర్థము
(విశేష్యము): శాంతి; నొప్పి తగ్గటం; అనునయనము; ఊరట; జంతు బలి
Meaning
(noun) : peace; calmness; soothing; animal sacrifice
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
వరుస దప్పని కారణావళులతోడఁ
గీలు కొల్పినఁ గారణమాలయగును
నీతిచే సిరి సిరి చేత దాతృతయును
దాతృతను భూరియశమన్నరీతి శర్వ
(కారణం కార్యం ఒకదానికొకటిగా చెప్పుకుంటూ పోతే అది కారణమాలాలంకారము. కారణం అంటే cause, కార్యం అంటే effect. ఒక కారణానికి కార్యం మఱొక కార్యానికి కారణంగా ఉంటే అది కారణమాల. ఉదాహరణకు - నీతి చేత సంపద, సంపద చేత దానగుణం, దానగుణం వలన గొప్ప కీర్తి వస్తాయి)
-- చంద్రాలోకం, ఆడిదము సూరకవి (18 వ శతాబ్దము)
Comments
Post a Comment