వేష్టువ

 

ఏప్రిల్ 05, 2023

వేష్టువ    (veshtuva)

    అర్థము

   (విశేష్యము): చుట్టుకునేది; ధోవతి; పంచె

   Meaning

   (noun) : a garment; waist cloth

   వాడుక / Usage

అడవిలో విధివశాత్తు తన వేష్టువ పోగొట్టుకున్న నలుడికి దమయంతి తన చీరలో సగభాగం ఇచ్చింది.
Damayanthi gave half her saree to Nala who lost his waist cloth due to cruel fate.

   మెదడుకు మేత / Food for thought

మర్మమెఱుగ లేక మతములు కల్పించి
యుర్విజనులు దుఃఖ మొందుచుంద్రు
గాజుటింటి కుక్క కళవళపడురీతి
విశ్వదాభిరామ! వినుర వేమ!

(అద్దాల గదిలో ఉన్న కుక్క దర్పణంలో తన ప్రతిబింబాన్ని చూచి కలతపడి ఏ విధంగా బాధపడుతుందో, అలాగే మూఢ జనులు ఆత్మతత్వం తెలుసుకోలేక, విభిన్న మతాలను కల్పించి, మతమౌడ్యంలో చిక్కుకుని, ఒకరినొకరు ద్వేషించుకొనుచూ, దుఃఖంతో కాలం గడుపుతున్నారు. నిజానికి పరబ్రహ్మం ఒక్కటే అని గుర్తించలేని అజ్ఞాన స్థితిలో ఉన్నారు.)
--వేమన శతకం, వేమన (ఆగష్టు 25, 1652 - 1730)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి