బిట్టు

 

ఏప్రిల్ 07, 2023

బిట్టు    (biṭṭu)

    అర్థము

   (విశేష్యము): మిక్కిలి; తరచుగా; శీఘ్రము; అధికము; దృఢత్వం

   Meaning

   (noun/adv) : excess; often; quickly; firmness

   వాడుక / Usage

బెట్టు చేసిన ప్రియురాలిని బిట్టుగా కౌగిలిలో బిగించి సరసమాడాడు.
He melted her reticence with a tight embraced dalliance.

   మెదడుకు మేత / Food for thought

చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!

(ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు.)

-- భాస్కర శతకం,మారవి వెంకయ్య కవి (~ 16వ శతాబ్దం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి