మంజూషము

 

ఏప్రిల్ 10, 2023

మంజూషము    (manjūshamu)

    అర్థము

   (విశేష్యము): పెట్టె; భోషాణము

   Meaning

   (noun) : large basket/box; compartment

   వాడుక / Usage

ధూమ శకటంలోని ప్రథమ శ్రేణి మంజూషము సువిశాలంగా ఉంది.
The first class compartment in the train is spacious.

   మెదడుకు మేత / Food for thought

పిల్లికి పులి మేనమామాట. అలాగే నా ఒపీనియన్లో రైలు బస్సుకి మేనమామ. అదే విషయం రైల్లో ఫస్టుక్లాస్స్ కంపార్టుమెంట్లో మా గురూగారితో అన్నాను. గురూగారంటే మా ప్రియతమ హజ్బెండ్. అసలీ హబ్బీలు రైలు డబ్బీల్లా రెండు రకాలు. బాడ్ హబ్బీలు, వరస్ట్ హబ్బీలు అని. కమింగ్ టు ది లెక్చర్, రైలు కూతలో ఒక తమాషా ఉంది. అది ప్రగతిశీల శక్తికి సామాజిక స్పృహకి సాంఘిక దృక్పథానికి సంకేతం. శ్రీవారు ఫస్ట్ క్లాసులో ఆవకాయ జాడి తీసుకెళ్లడం మర్యాద కాదన్నారు. విమానాల్లో ఉల్లిపాయలు తీసుకెళ్లడం లేదా అన్న ప్రశ్నతో వారి నోరు మూసాను. ఏమంటారు?..నేను అవాక్స్ అండ్ చవాక్స్ పేలుతున్నానంటారా? అయితే సరే మీకు, రైలు ప్రయాణపు ముచ్చట్లకు ఎగ్ బై : ఎగ్ అంటే గుడ్డు లెండి.

-- పురాణం సీతగారి రచనాశైలికి పేరడీ, శ్రీ రమణ

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి