అంతరాంతరము
మే 12, 2023
అంతరాంతరము (anta-rāntaramu)
అర్థము
(విశేష్యము): తారతమ్యం; వ్యత్యాసం; అన్నిటికన్నా లోపల ఉన్న భాగము
Meaning
(noun) : difference; distinction of rank; innermost
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
నేను యువతీయువకులతో మాట్లాడుతున్నప్పుడు వేచి ఉండటాన్ని గురించి వివరంగా చెబుతుంటాను. ఒక రకమైన చైనా వెదురుబొంగు చెట్టు ఉంది. దాని విత్తనాన్ని భూమిలో నాటి ఒక సంవత్సరం పాటు నీళ్లు పోసి పరామర్శించినప్పటికీ మొలక నేలపై రాదు. ఐదు ఏళ్ళ తర్వాత మొలకెత్తుతుంది. ఆపై ఆరువారాల్లో 90 అడుగులు ఎత్తుకు ఎదుగుతుంది. మరి ఆ అయిదు ఏళ్ళు ఏమి చేసింది. వేరులను పెంచుకుంది. తర్వాత పెరగడానికి సంసిద్ధం చేసుకుంది. వేచి ఉండటం కూడా అభివృద్ధే. ఆ సమయంలో నిరాశావాదం తగదు.
-- బిట్స్ పిలానీ స్నాతకోత్సవంలో రాహుల్ ద్రావిడ్
Comments
Post a Comment