కొసరు
మే 17, 2023
కొసరు (kosaru)
అర్థము
(విశేష్యము/క్రియ): విజృంభించు, సంకోచించు, ప్రార్థించు, కోరిక, ఒక వస్తువును కొన్నదానికిచ్చే పెచ్చు
Meaning
(noun/verb) : to ask for little extra; greedy; desire; hesitate
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
ఏమి వెదుకుతున్నావూ?
ఈ జీవిత శిథిలాల్లోనీవూ?
చెదిరిన నీ సుఖస్వప్నాలే అవి
రంగుల రంగుల గాజుపెంకులూ
బ్రతుకు పంటలో తాలుకంకులూ
పెంటపోగులో విశ్రమించినయ్
దాగని బ్రతుకుల రంగుల బొంకులు
చివికిన ఖాళీసిగరెట్ పెట్టెలు
మంటిని గలసిన సిగరెట్‌పీకలు
గాలి అలలలో తేలియాడుతూ
నేలనువాలే కోడియీకలూ
తళుకు కాగితం, మెరిసే తగరం,
తుప్పుతినేసిన యినుపరేకులూ
మందుల పొట్లాలకు పనికొచ్చిన
చిరిగిన మాసిన ప్రేమలేఖలూ
నల్లని యెర్రని గుడ్డపీలికలు
పూర్వపుటందము చెడినపోలికలు
గుప్పెడుదుమ్మూ, పిడికెడు బూడిద
యిది నీ మిగిలిన జీవితసంపద.
ఈ జీవిత శిథిలాల్లోనీవూ?
చెదిరిన నీ సుఖస్వప్నాలే అవి
రంగుల రంగుల గాజుపెంకులూ
బ్రతుకు పంటలో తాలుకంకులూ
పెంటపోగులో విశ్రమించినయ్
దాగని బ్రతుకుల రంగుల బొంకులు
చివికిన ఖాళీసిగరెట్ పెట్టెలు
మంటిని గలసిన సిగరెట్‌పీకలు
గాలి అలలలో తేలియాడుతూ
నేలనువాలే కోడియీకలూ
తళుకు కాగితం, మెరిసే తగరం,
తుప్పుతినేసిన యినుపరేకులూ
మందుల పొట్లాలకు పనికొచ్చిన
చిరిగిన మాసిన ప్రేమలేఖలూ
నల్లని యెర్రని గుడ్డపీలికలు
పూర్వపుటందము చెడినపోలికలు
గుప్పెడుదుమ్మూ, పిడికెడు బూడిద
యిది నీ మిగిలిన జీవితసంపద.
-- జీవితం, ఆలూరి బైరాగి (నవంబర్ 05, 1925 - 1978)
Comments
Post a Comment