పైకొను

 

మే 18, 2023

పైకొను    (pai-konu)

    అర్థము

   (క్రియ): దుర్కొను, కలియబడు, మించిపోవు, ప్రయత్నించు; కలుగు

   Meaning

   (verb) : to exceed; attack; attempt; to happen

   వాడుక / Usage

దుండగులను పైకొని ఆమె చూపిన ధైర్య సహాసాలు అమోఘం.
   Her bravery in standing up to the miscreants was extraordinary.

   మెదడుకు మేత / Food for thought

ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడి? 
నువ్వేడ కాచుకోనుంటవె వన్నెలాడి?
పుగతోటకు నీళ్లుపెట్టి,
బుగతగారి నేమరించి,
కోరుకొన్న మొగలిపొత్తి కొండకోన వెతికితెచ్చి,
అలసట తీరేతలికే అద్దరేత్తి రవుతాది-
ఏ గంటకు రమ్మంటవె కన్నెలేడి?
చీకట్లో నీ అందము చిక్కువిడదు నా కంటికి;
వెన్నెలలో నీ రూపము కన్ను చెదరగొడతాది;
చీకటి వెలుగుల సందున చేరరావె చిన్నారీ
--బంగారిమామ పాటలు, కొనికళ్ళ వెంకటరత్నం (1909 - 1971)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి