ఉంబళి

 

మే 22, 2023

ఉంబళి    (umbaḷi)

    అర్థము

   (విశేషణము): పన్ను లేకుండా భూమి వగైరా అనుభవించుట; ఈనాము; జాగీరు

   Meaning

   (adj/noun) : free from taxation/rent

   వాడుక / Usage

రాజాస్థానంలోని ఉద్యోగులకు, మంత్రులకు, పండితులకు పోషణగా ఉంబళి గ్రామాలూ ఇచ్చేవారు.
   Jageers were given to employees of the court as tax free estates.

   మెదడుకు మేత / Food for thought

చందమామను చూచి వద్దామా సదానందా
తల్లడించే తామసులను వెళ్ళవేసి వేవేగ
పంచబాణుని పారద్రోలి కుంజరమ్ముల కూలవేసి
శత్రులార్గురి చెంతచేరక ఇంద్రియాదుల వెంటబోక
మట్టు తెలిసి మేలుకోట పట్టణంబున చేరి ఇపుడు...
చదువులన్నీ చదివిచదివీ చచ్చిపోయేదింతె గానీ
గుట్టు తెలిపే గురుడు గల్గితే చూడవచ్చును సులభమున్నదీ...
ఒళ్ళుమరచి తారకమున తెల్లవారేదనక మనము...

మంటి మింటి రెంటి నడుమ ఒంటి స్తంభపు మేడ మీద...

అమర నారేయణ స్వామి ఆదిగురుని బోధచేత


తలచినప్పుడె తనువులోన తప్పకుండా చూడవచ్చును...


-- కైవారం అమర నరేయణ (1762 - 1837)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి