అప్పనము

 

మే 24, 2023

అప్పనము    (appanamu)

    అర్థము

   (విశేష్యము): అర్పణము; కానుక; రాజుకు అర్పించే కట్నము/పన్ను; ఉచితము  

   Meaning

   (noun) : tribute; tax; offering; gift; free

   వాడుక / Usage

ట్విట్టర్ డేటాను మరో టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ అప్పనంగా వాడేస్తామంటే మస్క్ ఊరుకుంటాడా?
   Will Musk allow Microsoft to appropriate Twitter data for free?!

   మెదడుకు మేత / Food for thought

కళ్ళు మూసుకోవడం వల్ల ఏమీ మారదు. నువ్వు చూడకపోవడం వల్ల జరిగేవి మాయం అయిపోవు. పైగా నువ్వు కళ్ళు తెరిచేటప్పటికి ఇంకా విషమంగా తయారు అవుతాయి. మనం ఉన్న ప్రపంచం అలాంటిది. అందుకే కళ్ళు బార్లా తెరిచి ఉంచు. పిరికివాడే వాటిని మూస్తాడు. కళ్ళు చెవులు మూసుకుంటే సమయం ఆగిపోదు.
-- కాఫ్కా ఆన్ ది షోర్, హరుకి మురకామి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి