దస్కం
మే 30, 2023
దస్కం (daskam)
అర్థము
(విశేష్యము): డబ్బు; పది రూపాయిలు; దశ=పది నుండి
Meaning
(noun) : money; ten rupees
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
ఆశచేత మనుజులాయువు గలనాళ్ళు
తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ!
తిరుగుచుందురు భ్రమ తిప్పుదాక
మురికి భాండమందు ముసురు నీగల భంగి
విశ్వదాభిరామ వినురవేమ!
(మురికి కుండపైన ఈగలు ముసురునట్లుగా మనిషి భౌతిక సుఖాల చుట్టూ జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు. ఎన్నాళ్లు తిరుగుతాడు? ఎన్నాళ్లంటే భ్రమ తొలిగేదాక. భ్రమ తొలిగేది లేదు ఆశ చచ్చేది లేదు అని సారాంశం.బతకడానికి ఆశ అవసరమే కాని ఇది నిరంతర అత్యాశ. అందుకే ఆశాపాశం, ఆశాబంధం అనే మాటలు పుట్టాయి. ఆశలో చిక్కుబడిపోతే అంతే సంగతులు అంటున్నాడు వేమన. ఆశను వదులుకుందామన్నా భ్రమ వదలనివ్వదు. ఆశ అంటే కోరికే. తెలియని సుఖాలపైన ఆసక్తే ఆశ. భ్రమ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా తోపింపజేసేది. ‘ఆయువు గలనాళ్లు’ అంటే బతికి ఉన్నంతవరకు. ఆయువు అంటే వయస్సు, జీవితాన్ని పెంచేదని కూడ. ఆయుష్యం అంటే సుదీర్ఘ జీవితం. భ్రమపరిభ్రమానికి హేతువు. భ్రమ వల్లనే ఆశకు అంతటి ఆరాటం. ఉన్నదాన్ని స్పష్టంగా చూడగలిగితే తప్ప భ్రమ తొలగదు.భ్రమను తొలగించుకోవాలనేది సందేశం)
-- వేమన శతకం, వేమన (1652 - 1730)
Comments
Post a Comment