చర్వితచర్వణము
మే 08, 2023
చర్వితచర్వణము (charvitacharvanamu)
అర్థము
(విశేషణము): చర్విత=నమలబడినది; నమిలినదానిని తిరిగి నములుట; నెమరువేసుకొనడం; చెప్పిందే మళ్ళీ చెప్పడం
Meaning
(noun/adj) : chewing on the cud; ruminate; repeat oneself
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
ఈ ప్రపంచంలో పుట్టినవారందరికీ చరిత్రపుటలలో ఒక పుట కేటాయించబడింది. అయితే ఆ పుటను ఈ ప్రపంచమంతటిచే చదివింపజేయడమనేది మీ చేతులలోనే ఉంది. మీరందరూ ప్రత్యేకతను కలిగినవారే! అయితే ఈ ప్రపంచం రేయింబవళ్లు కఠోర శ్రమను చేస్తూనే ఉంది. ఎందుకో మీకు తెలుసా? మిమ్మల్ని ఇతరులవలె తీర్చిదిద్దేటందుకు. 'ఆ మాయ వలలో నేను చిక్కుకోను, నేను నేను గానే ఉంటాను' అని మీరు ఆలోచించిన మరుక్షణమే చరిత్రలో మీ గురించిన పుటలను లిఖించేందుకు సమాయత్తం అయ్యారని అర్థం. చెప్పాలంటే 'నువ్వు నువ్వుగానే ఉండు. ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతరులువలే ఉండేందుకు ప్రయత్నించవద్దు' అని అర్థం.
-- శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం (అక్టోబర్ 15, 1931 - 2015)
Comments
Post a Comment