సతతహరితారణ్యము
మే 09, 2023
సతతహరితారణ్యము (satataharitharanyamu)
అర్థము
(విశేష్యము): సతత=ఎల్లప్పుడూ, హరిత=ఆకుపచ్చ, అరణ్యము=అడవి; ఆకులు రాల్చని వృక్షాలు గల వనం
Meaning
(noun) : evergreen forest
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
నా దేశ ప్రజలతో అన్యదేశ భాషలో మాట్లాడాల్సిన దుస్థితిని చూసి సిగ్గు పడుతున్నాను. ఆంగ్లంలో చదువుకుంటున్నవారు అభివృద్ధి చెందుతున్నారంటూ, ఆంగ్లేయులు మనకి మంచిని చేస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే విద్య పేరిట ఇక్కడ ఆంగ్లమే బోధిస్తున్నారు కదా. గత యాభై సంవత్సరాలుగా మన మాతృ భాషలో శిక్షణ పొంది ఉన్నట్లయితే నేడు మనకి ఇంకా ఎంత ఫలితం లభించి ఉండేదో ఆలోచించండి. భారత దేశం స్వాతంత్ర్యాన్ని పొంది ఉండేది. ఇక్కడ మన దేశీయ విద్యను అభ్యసించిన వారు ఉండే వారు. స్వదేశములో విదేశీయులుగా ఉండిపోకుండా మన ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసి ఉండేవారు. నిరుపేదల మధ్య ఉంటూ వాళ్ళ కోసం శ్రమించేవారు. మన ప్రవర్తనే మనలను తీర్చిదిద్దుతుంది.
-- 1916 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మహాత్మా గాంధీ (అక్టోబర్ 02, 1869 - 1948)
Comments
Post a Comment