నికష
జూన్ 13, 2023
నికష (nikasha)
అర్థము
(విశేష్యము): సాన; బంగారం వగైరా పరీక్షకు వాడే గీటురాయి
Meaning
(noun) : touchstone
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
ఇదే ప్రకృతి, హోరున వర్షం కురుస్తుంటే, దట్టంగా మంచు రాలుతుంటే, పున్నమినాటి వెన్నెల రేకలు భూకాసారం మీద సహస్రదళ పద్మంలా పరుచుకుంటుంటే ఎలా ఉంటుంది? ఈ మంచు, ఈ కొండలు అన్ని వేళలా మనిషికి మెప్పుతెప్పించేవిగా ఉండగలవా? మనస్సంతా ఏదో చెప్పడానికి చేతగాని ఉదాత్త భావస్ఫురణలో గంభీరంగా పరిపూర్ణంగా ఉంది. ఇంతలో ఎదురుగ్గా కనిపిస్తోంది పెద్ద సొరంగ మార్గం. అడ్డువచ్చిన పర్వత శరీరాన్ని దొలుచుకుని ప్రకృతిని ఇలా జయిస్తున్నామనే గర్వరేఖ మనిషి తన ముఖం మీద వెలయించుకోడానికి అవకాశమిచ్చే మానవ సృష్టి అది. దాని పేరు జవహార్ టన్నెల్. పిర్‌పంజల్ పర్వత శ్రేణిని దూసుకుని దాన్ని దాటుకుంటూ కిందనున్న కాశ్మీర్ లోయలోకి దిగడానికి అదే మార్గం.
-- కాశ్మీర దీప కళిక, నాయని కృష్ణకుమారి (మార్చ్ 14, 1930 - 2016)
Comments
Post a Comment