మాపనము

 

జూన్ 15, 2023

మాపనము    (mapanamu)

    అర్థము

   (విశేష్యము): కొలత; పరిమాణము; ఆది; కొలుచుట

   Meaning

   (noun) : measurement; measuring; size

   వాడుక / Usage

ఉపాధ్యాయులు ఆశించిన ప్రయోజనాలను, లక్ష్యాలను మాపనం చేయాలి.
   Teachers need to measure outcomes and learning objectives.

   మెదడుకు మేత / Food for thought

ఆ గవాక్షమ్ము తానెంత యమృతరాశి
ఎవ్వరును లేని సమయాన నేగి దాని
స్పర్శసుఖమున పులకలుజాదుకొనగ
ప్రణయమున ముగ్ధుడను పరవశుడనైతి
 
(ఆమె ఆ కిటికీ దగ్గర కనిపించేది. కాబట్టి ఆ కిటికీ ఎంత అమృతరాశిగానో మారిపోయింది. ఎవరూ లేనిసమయం చూసి అక్కడకు వెళ్ళి ఆ కిటికీని ముట్టుకోగానే ఒళ్ళంతా పులకలెత్తుతుంది. ఆ ప్రేమసంతోషంలో ముగ్ధుణ్ణీ, పరవశుణ్ణీ అయిపోతాను)
-- సౌభద్రుని ప్రణయయాత్ర, నాయని సుబ్బారావు (అక్టోబర్ 29, 1899 - 1978)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి