రూపణము

 

జూన్ 16, 2023

రూపణము    (rūpaṇamu)

    అర్థము

   (విశేష్యము): తార్కాణము; చూపు; విచారణ; ప్రమాణముల చేత విషయము పరిశీలించుట

   Meaning

   (noun) : investigation for (dis)proving; examination; search

   వాడుక / Usage

విద్యాబోధనలో రూపణ నికష అత్యంత అవసరము.
   An investigatory exam to identify weak students/topics is crucial.

   మెదడుకు మేత / Food for thought

పైని వేంచేసి యూపిరి పట్టుకొనుచు
చిన్ని తాబేలు నన్ను వీక్షించి జలము
త్రవ్వుకొనుచేగె కూపగర్భమున దాగ
పై నలముకున్న సుళ్ళు నా పాల విసిరి.
 
నీకు లేదమ్మ యన్నది నీటిపాము
పైకెగసి యొక్క కప్పను పట్టుకొనుచు.
నాకు లేదమ్మ యన్నాను శోకవహ్ని
తప్త హృదయుండనై యింటిదారి పట్టి.
 
(స్నానం చెయ్యడానికి బావి దగ్గరికి వెళ్తే, ఆ బావిలో గాలి పీల్చుకోడానికి నీళ్ళమీదకు తేలి ఉన్న తాబేలు నన్ను చూసి తొందరగా లోపలకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతూనే ఆ నీళ్ళు సుళ్ళు తిరిగి నీళ్ళ పైన సున్నాలు చుట్టుకుంటూ ఉన్నాయి. అంటే నాకు శూన్యమే మిగిలిందన్నమాట. ఒక నీటిపాము పైకి ఎగిరి ఒక కప్పని పట్టుకుని ‘నీకు అమ్మ లేదు’ అంది. నన్ను దహిస్తున్న దుఃఖంతో ‘నాకు కూడ అమ్మలేదు’ అని చెప్పి ఇంటిదారి పట్టాను. నన్ను కూడా మృత్యువు తన కోరల్లో చిక్కించుకున్నట్టే అనిపించింది.)
-- మాతృగీతాలు, నాయని సుబ్బారావు (అక్టోబర్ 29, 1899 - 1978)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి