గులేబకావళి
జూన్ 26, 2023
గులేబకావళి (gul-e-bakawali)
అర్థము
(విశేష్యము): గుల్ (అరబిక్) = పువ్వు; బకావళి అనే పువ్వు; బ్రహ్మ కమలం; నిశాగంధి
Meaning
(noun) : orchid cactus; night blooming flower
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
కాని పాశ్చాత్య సంప్రదాయపు సుడిగాలికి వీళ్ళు కూడ ఒంగి, లొంగిపోయి, పాశ్చాత్య పద్ధతి ప్రకారం పెట్టిన పేరు మొదట, ఇంటిపేరు చివర రాయడం ఈ మధ్యే మొదలు పెట్టేరు. కాని కల్చరు పేరు మీద కొట్టుకుచచ్చే మన తెలుగు వాళ్ళు అంత సులభంగా లొంగుతారా? హరి మీద గిరి పడ్డా, గిరి మీద హరి పడ్డా మనం మాత్రం వి. వి. రావ్, పీ. కే. మూర్తి, యన్. టీ. రామారావు అనే రాస్తాం తప్ప, మిగిలిన ప్రపంచపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడం. అసలు యన్. టీ. రామారావుని “యన్టీయార్” అన్నప్పుడున్న మజా తల్లకిందులుగా రామారావ్ టీ. నందమూరి అంటే వస్తుందా? తల్లకిందులుగా తపస్సు చేసినా రాదు.
-- "మన పేర్లు, ఇంటి పేర్లు", వేమూరి వేంకటేశ్వర రావు (https://eemaata.com/em/issues/200011/817.html)
Comments
Post a Comment