చూడామణి

 

జూన్ 27, 2023

చూడామణి    (chudamani)

    అర్థము

   (విశేష్యము): అలంకారానికి తల మీద పెట్టుకునే రత్నము; తలమానికం

   Meaning

   (noun) : crest; jewel worn on top of head; best or excellent

   వాడుక / Usage

1941 లో వచ్చిన చూడామణి చిత్రం సాంఘిక కథలకు ప్రోత్సాహం ఇచ్చింది.
   The movie Chudamani released in 1941 gave a fillip to social stories.

   మెదడుకు మేత / Food for thought

సుమారు 1960 సంవత్సర ప్రాంతాల్లో మొదట ఆంధ్ర పత్రికలో పని మొదలు పెట్టాను. నెమ్మదిగా నన్ను ఆంధ్రపత్రిక వీక్లీకి సహాయ సంపాదకుడుగా వేసుకున్నారు. తరవాత కొంతకాలం ఆంధ్రప్రభ డైలీకి Chief Sub-editor గా ఉన్నాను. పత్రికల్లో పనిచేస్తున్నప్పుడే ప్రముఖ జర్నలిస్ట్‌శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారితో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఆయన దగ్గరనుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆంధ్ర కేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు చనిపోయిన వార్తని పేపర్లో ఎలా రిపోర్ట్‌చెయ్యాలా అని ఆలోచించి “ప్రకాశహీనమైన ఆంధ్రప్రదేశ్‌” అన్న హెడ్డింగుతో పూర్తి కవరేజి ఇచ్చాను. అది చూసి శ్రీ నార్ల గారు ఎంతో మెచ్చుకొని “న్యూస్‌పేపర్లో ఎలా రిపోర్ట్‌ చెయ్యాలో, మన ఆంధ్రప్రభని చూసి మిగిలిన పేపర్లు నేర్చుకోవాలి” అన్నారు.
-- వేటూరి (జనవరి 29, 1936 - 2010) (https://eemaata.com/em/issues/200011/815.html)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి