అపేక్ష్య
జూన్ 28, 2023
అపేక్ష్య (apēkshya)
అర్థము
(విశేష్యము): అపేక్షించ తగినది; అపేక్ష=కోరిక, వాంఛ, ఆశ
Meaning
(noun) : worthy of desire/wish
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
“ఏమిటీ? పాసిపోయిన అన్నం తినేవాళ్ళా మీరు?”
“పాసిపోకుండా ఉండడానికే నీళ్ళు పోయడం.”
“ఛీ! ఛీ! అలా నీళ్ళోడుతున్న అన్నాన్ని ఎలా తింటారబ్బా!”
“తినరు. తాగుతారు.”
“అన్నం తాగుతారా ఎక్కడైనా?”
“అన్నం కాదు. తరవాణి.”
“ఏదో ఒక అన్నం.”
” నీకెందుకు? నేను చేసి చూపిస్తాగా? అప్పుడు నువ్వే దాన్ని జుర్రుకుంటూ తాగుతావు.”
“ఛీ! నేనెప్పుడూ జుర్రను.”
మొత్తానికి ఎలాగైనా తరవాణిని చేసి ఆవిడ చేత తాగిస్తే గానీ దాని అద్భుతం తనకు బోధపడదనిపించింది.
-- తరవాణి కేంద్రం, మాచిరాజు సావిత్రి (https://eemaata.com/em/issues/200011/806.html)
Comments
Post a Comment