వేగుచుక్క
జూన్ 29, 2023
వేగుచుక్క (veguchukka)
అర్థము
(విశేష్యము): వేగు=వేకువ; వేకువ ఝామున కనిపించే నక్షత్రం/గ్రహం; శుక్రుడు
Meaning
(noun) : morning star; Venus
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
శ్రీ కె. వి. మహాదేవన్ “సప్తపది” సినిమాలో స్వరం ఇచ్చిన రెండు సింధుభైరవి పాటలూ హిట్సే! ఈ పాటలకన్న ముందు గుర్తు పెట్టుకోవలసిన పాట మూగమనసులు సినిమాకోసం సింధుభైరవి రాగంలో స్వరం ఇచ్చిన “ముద్దబంతి పూవులో …” అన్న పాట. ఈ పాట వచ్చిన కొత్తల్లో ఎంత ప్రజాదరణ పొందిందో, ఇప్పటికీ తెలుగువాళ్లల్లో అంత పాప్యులర్‌అయిన పాట ఇది. రేడియో ద్వారా లలిత సంగీతాన్ని ప్రజలకు అందించిన సంగీత దర్శకులు, గాయకులు కూడా సింధుభైరవి రాగాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించుకొన్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకప్పటి విజయవాడ రేడియో ఆర్టిష్టులైన శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు, శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ, శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం వంటి వారు చాలా లలిత గీతాలు సింధుభైరవి రాగంలో పాడారు.
-- రాగలహరి: సింధుభైరవి, విష్ణుభొట్ల లక్ష్మన్న (https://eemaata.com/em/issues/200011/816.html)
Comments
Post a Comment