గూడుపుఠాణి
జూన్ 30, 2023
గూడుపుఠాణి (guduputani)
అర్థము
(విశేష్యము): మోసము; కుట్ర; వంచన; రహస్య మంతనాలతో ఎత్తుగడ (గూఢ=రహస్య, ఠాణి=స్థానం)
Meaning
(noun) : conspiracy; plot
వాడుక / Usage
మెదడుకు మేత / Food for thought
జరిగినవి రెండు సంఘటనలు. ఒక సైనికుని హత్య, అతని భార్య పై బలాత్కారం. ఈ సంఘటనలలోని ప్రత్యక్ష పాత్రల కథనం, ప్రత్యక్ష – పరోక్ష సాక్షుల కథనం ఒకరు చెప్పిన దానికి, మరొకరు చెప్పిన దానికి పొంతన లేదు. ఈ ప్రపంచంలో “పరమసత్యం” అన్నది లేదా? ఒకటి కన్నా మరొకటి నిజం. ఒకటి కన్నా మరొకటి అబద్ధం. ఇదేనా “జీవిత సత్యం”? 1950 సంవత్సరంలో, అప్పటికి ఎక్కువ మందికి తెలియక పోయినా ఆ తరవాత కాలంలో అంతర్జాతీయ సినిమా దర్శకుల్లో గొప్ప పేరు వచ్చిన జాపనీస్ సినిమా దర్శకుడు అకీరా కురొసోవా (Akira Kurosawa) తీసిన సినిమా “రషోమాన్” (Rashomon) కథకు మూలం పైన చెప్పిన తాత్వికమైన ఆలోచన.
-- ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా,
విష్ణుభొట్ల లక్ష్మన్న (https://eemaata.com/em/issues/200803/1222.html)
Comments
Post a Comment