మదింపు

  

జూన్ 14, 2023

మదింపు    (madimpu)

    అర్థము

   (విశేష్యము): వెల నిర్ణయించుట; అంచనా

   Meaning

   (noun) : estimate; valuation; appraisal

   వాడుక / Usage

బోధనాభ్యాసన ప్రక్రియలో పిల్లలకు తెలియకుండానే వారి సామర్ధ్యాలను పరీక్షించడాన్ని మదింపు అంటారు.
   Appraisal is the process of evaluating student abilities seamlessly as part of lesson and exercises.

   మెదడుకు మేత / Food for thought

చంద్ర సూర్యులు తారకా సముదయమ్ము
పుడమియును నాకమును పెక్కు భువనములును

ప్రేమ సూత్రమ్మునం గ్రుచ్చి విశ్వకర్మ

గళమునందాల్చు ముత్యాలు గావె తలప
(సూర్యచంద్రులు, నక్షత్రాలు, భూమి, స్వర్గం, ఇతర సమస్త లోకాలు, ఇలా అన్నీ, సృష్టికర్త బ్రహ్మ అంశ అయిన విశ్వకర్మ (యూనివర్సల్ ఆర్కిటెక్ట్) ప్రేమ అనే తాడుకు గుచ్చి కూర్చి మెడన దాల్చిన ముత్యాలే కదా! ఆలోచిస్తే!!)
-- సౌభద్రుని ప్రణయయాత్ర, నాయని సుబ్బారావు (అక్టోబర్ 29, 1899 - 1978)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి