వేసరు

 

జులై 28, 2023

వేసరు    (vesaru)

    అర్థము

   (క్రియ): శ్రమ పడు; విసుగు చెందు; నొచ్చు; దుఃఖించు

   Meaning

   (verb) : to be troubled or fatigued; 

   వాడుక / Usage

ఏకాగ్రత లేని పని ఎంత వేసరు పడినా సఫలము కాదు.
   Working to fatigue, but without focus will not yield results .

   మెదడుకు మేత / Food for thought

వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
 (ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.)
--ఆంధ్ర మహాభాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి