దృక్కోణము

 

జులై 11, 2023

దృక్కోణము   (drukkonamu)

    అర్థము

   (విశేష్యము): దృక్కు=కన్ను (బుద్ధి), కోణము=మూల; దృష్టితీరు; పరిశీలించు పద్ధతి

   Meaning

   (noun) : perspective 

   వాడుక / Usage

'తెలుగు పాట యాభై ఐదేళ్ళ పరిణామాన్ని ముచ్చటైన మూడు దృక్కోణాల నుంచి పరిశీలించటం మా లక్ష్యం'.
We intend to examine the 55 year change of Telugu film song from 3 perspectives.

   మెదడుకు మేత / Food for thought

సిగలోకి విరులిచ్చి 
చెలినొసట తిలకమిడి
సిగపూవు వాడకనే
చెలిబ్రతుకు వాడెనయ్యా
పరువానికి బలవంతాన
పగ్గాలే వేస్తావా
మనసుమూసి మమతలు రోసి
మనుగడ మసి చేస్తావా
తనువు చిక్కి శల్యంబైనా
వలపులణిగి పోయేనా
ఇరవైలో అరవై వయసు
ఎవరికైన వచ్చేనా
ఎవరికైనా వచ్చేనా         
తీయనైన జీవితాన 
చేదువిషంతాగేవా
తోడునీడగా ఒకరుండి
ఏకాకిగ బ్రతికేవా
కోరినది చేతికిచిక్కి
ఆరుతున్నదొక దీపం
కోరినదిచేతికిరాక
ఆరకున్నదొక తాపం
ఆరుకున్నదొక తాపం        
అంధుని ఎదుట అందాలేలా
అడవిని పున్నమి వెన్నెలలేలా
అసమర్ధున కవకాశాలేలా
వృధా... వృధా... ఈ బ్రతుకు వృధా....

    -- సుమంగళి, ఆత్రేయ (మే 07, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి