అనుభూతి

 

జులై 12, 2023

అనుభూతి   (anubhuthi)

    అర్థము

   (విశేష్యము): సుఖదుఃఖాలు పొందుట; ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రమాణములు వల్ల కలిగే జ్ఞానము; అనుభవము

   Meaning

   (noun) : feeling; knowledge gained from direct/indirect proof/truth; experience 

   వాడుక / Usage

'సినిమా ప్రేక్షకుడికి “అనుభూతి” కావాలి. అది అతికొద్దిసేపట్లో అందాలి'.
A person watching a movie looks for an experience. In a short time.

   మెదడుకు మేత / Food for thought

కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
అమృత పానమును అమర గానమును
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలినితేలుచూ సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా

ప్రేమలు పూచే సీమల లోపల
ప్రాణాలు పూచె సీమల లోపల
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తెలియాడితిని
కాదు సుమా కల కాదు సుమా

కన్నె తారకాల కలగానముతో
కన్నె తారకాల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ... ఓ... ఓహో... ఓ... ఓ... ఓహో..
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా

పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
ఆహా... ఆ... ఆ... ఆహా... ఆ... ఆ...
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా

    --కీలుగుఱ్ఱం, తాపి ధర్మారావు (సెప్టెంబర్ 19, 1887 - 1973)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి