వైఖరి

 

జులై 13, 2023

వైఖరి   (vaikhari)

    అర్థము

   (విశేష్యము): విధము; ధోరణి; వాక్కు

   Meaning

   (noun) : appearance; manner 

   వాడుక / Usage

'మనం పక్షపాత వైఖరిని వదిలి చూస్తే, కొత్త పాటల్లో కూడా ఇలా మరచిపోలేని అనుభూతుల్ని సృష్టించే పాటలు చాలా ఉన్నాయి'.
If we look impartially even some new songs encase unforgettable feelings.

   మెదడుకు మేత / Food for thought

ఎవరో రావాలి..
నీ హృదయం.. కదిలించాలి
నీ తీగలు.. సవరించాలి
నీలో రాగం.. పలికించాలి

మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..
మూల దాగి ధూళి మూగి... మూగవోయిన మధుర వీణ..
మరిచి పోయిన మమత లాగ...
మరిచి పోయిన మమత లాగ... మమతలుడిగిన మనసు లాగ
మాసిపో.. తగునా...

ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..
ఎన్ని పదములు నేర్చినావో... ఎన్ని కళలను దాచినావో..
కొనగోట మీటిన చాలు...
కొనగోట మీటిన చాలు... నీలో కోటి స్వరములు పలుకును..

రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు
రాచనగరున వెలసినావు... రస పిపాసకు నోచినావు
శక్తి మరచి.. రక్తి విడచి...
శక్తి మరచి.. రక్తి విడచి... మత్తు ఏదో మరగినావు
మరిచిపో... తగునా...
    --ప్రేమ్ నగర్, ఆత్రేయ (మే 7, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి