కీలకము
జులై 14, 2023
కీలకము (kīlakamu)
అర్థము
(విశేష్యము): మేకు; మర్మము; కిటుకు; కీలు
Meaning
(noun) : pin, nail, wedge; key to a puzzle; secret
వాడుక / Usage
'పాటలో ఒక కీలకమైన పదాన్నిరసవత్తరంగా పాడడం కూడా ఇలాంటి ఫలితాన్నిస్తుంది'.మెదడుకు మేత / Food for thought
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..
నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ ఊహతోనే పులకించి పోయే
ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..
నీ కోసమే ఈ అడియాశలన్ని
నా ధ్యాస నా ఆశ నీవే సఖా
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో
ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ..
మనియేములే ఇక విరితావిలీల
మన ప్రేమ కెదురేది లేదే సఖి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..
ఊగేములే తుల తూగేములే
ఇక తొలి ప్రేమ భోగాలా..
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే
ఇక తొలి ప్రేమ భోగాలా..
మురిపాలతేలే మన జీవితాలు
మురిపాలతేలే మన జీవితాలు
దరహాస లీలావిలాసాలులే..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ
కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ..ఈనాటి ఈ హాయి..
-- జయసింహ, సముద్రాల (జులై 19, 1902 - 1968)
Comments
Post a Comment