ఎత్తికోలు
జులై 17, 2023
ఎత్తికోలు (etti-kōlu)
అర్థము
(విశేష్యము): సంకల్పము; ప్రయత్నము; కోరిక
Meaning
(noun) : endeavour; effort; intention; wish
వాడుక / Usage
రాష్ట్రంలో అర్థవంతమైన రాజకీయాలు ఎత్తికోలుగా మిగలవలిసిందేనా?మెదడుకు మేత / Food for thought
పద్మాకరం దినకరో వికచీ కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలమ్ ।
నాభ్యర్థితో జలధరో-పి జలం దదాతి
సంతః స్వయం పరహితే విహితాభియోగాః ॥
(ఏ ప్రార్థనా లేకుండానే సూర్యుడు తామర కొలనును వికసింపచేస్తున్నాడు. ఎలాంటి అభ్యర్థనా చేయకుండానే చంద్రుడు కలువలకు జీవాన్నిస్తున్నాడు. అడగకుండానే మేఘుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. సత్పురుషుల నడవడి కూడా ఇలాగే ఉంటుంది. తమని ఎవరూ అడగకుండానే వారు ఇతరులకి హితం కలిగే పనులకు పూనుకుంటారు.)
-- భర్తృహరి సుభాషితం
Comments
Post a Comment