మూర్ధజ

 

జులై 21, 2023

మూర్ధజ   (mūrdhaja)

    అర్థము

   (విశేష్యము): తలనుంచి పుట్టునది; తల వెట్రుక; కేశము

   Meaning

   (noun) : hair 

   వాడుక / Usage

    రాజకీయాలలో మూర్ధజాలు పండిపోయిన నేతలు మతంపేరుతో మనల్ని వేరు చేయడానికి వస్తున్నారు.
    Politically savvy and ripe (in hair) leaders are coming to divide us in the name of religion.

   మెదడుకు మేత / Food for thought

        అసమ్భవం హేమమృగస్య జన్మ
      తథాపి రామో లులుభే మృగాయ ।
      ప్రాయః సమాపన్నవిపత్తికాలే
      ధియోఽపి పుంసాం మలినా భవన్తి॥

(సృష్టిలో బంగారు జింకయొక్క పుట్టుక అనునది సంభవము కానిది. అయినప్పటికి సకలసద్గుణసంపన్నుడైన రాముడు కూడా ఆ బంగారు జింక కొరకు ఆశ పడ్డాడు. ఆపదలు సంభవించాలని ఉన్నప్పుడు, మేధావులయొక్క, అనగా సదసద్వివేకము కలవారియొక్క బుద్ధులు కూడా వివేకరహితములై, మలినమవుతాయి. ఎప్పుడైనా, ఎవరికైనా, ఉన్న వివేకాన్ని వాడనప్పుడే ప్రమాదములు సంభవిస్తాయి)
         -- హితోపదేశం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి