వసుమతి
ఆగష్టు 21, 2023
వసుమతి (vasumathi)
అర్థము
(విశేష్యము): భూమి; నేల
Meaning
(noun) : Earth
వాడుక / Usage
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై కదులునుగా సదా సదాశివా.మెదడుకు మేత / Food for thought
ఒరులేయవి యొనరించిన
నరవరయప్రియము తన మనంబునకగుదా
నొరులకునవి సేయకునికి
పరాయణము పరమధర్మపధములకెల్లన్
(ఎవరు ఏమి చేస్తే నీకు అప్రియం అనిపిస్తుందో అదే పని నీవు ఇతరుల విషయంలో చేయకు)
-- ఆంధ్ర మహాభారతం, తిక్కన (1205 - 1288)
Comments
Post a Comment