ఆన

 

ఆగష్టు 25, 2023

ఆన    (āna)

    అర్థము

   (విశేష్యము): ఆజ్ఞ; ప్రమాణము; ఒట్టు; గుర్తు; జాడ

   Meaning

   (noun) : command; order; oath; sign; mark

   వాడుక / Usage

నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం.
Can Brahma pen, set to the tune of Vedas, the play of Universe; without your command?

   మెదడుకు మేత / Food for thought

అక్కయ్యకు రెండో కానుపు
తమ్ముడికి మోకాలి వాపు
చింతపండు ధర హెచ్చింది
చిన్నాన్నకు మతి భ్రమించింది
లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు
గోరుచుట్టలా సలిపే లక్షల సమస్యలు...
గతమంతా తోలు బొమ్మలాడిన ఒక తెర
వర్తమానం నీ కన్నులగప్పిన ఒక పొర

-- అమృతం కురిసిన రాత్రి, దేవరకొండ బాలగంగాధర్ తిలక్(ఆగష్టు 01, 1921 - 1966)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి