ఎల్ల
ఆగష్టు 28, 2023
ఎల్ల (ella)
అర్థము
(విశేష్యము): పొలిమేర; హద్దు; సమస్తము; వెల్ల; సున్నం; కూర కొనడానికి వేసే పిడికెడు బియ్యం
Meaning
(noun) : boundary; all; white wash; fistful of rice given in lieu of vegetables
వాడుక / Usage
కాలభోజుడు చంద్రగిరి రాజ్యపు ఎల్లలు దాటాడు.మెదడుకు మేత / Food for thought
అది ఎప్పటికీ నా మాతృదేశమే
కానీ అది ఇంక నా దేశం కాదు
అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల
ఎన్నెన్నో దఫ్తర్లు తిరగాలి
మొహానికి ముద్ర వేయించుకోవాలి
కలలకి రుజువులు చూపించాలి...
కళ్ళకు వీసా అవసరం లేదు
కలలకు ఎల్లలు లేవు
మూసిన కళ్ళతో నే రోజూ
సరిహద్దు దాటి పోతా
మెహ్ది హసన్ ని కలిసి వస్తా
కానీ అది ఇంక నా దేశం కాదు
అక్కడికి వెళ్లాలంటే రెండు ప్రభుత్వాల
ఎన్నెన్నో దఫ్తర్లు తిరగాలి
మొహానికి ముద్ర వేయించుకోవాలి
కలలకి రుజువులు చూపించాలి...
కళ్ళకు వీసా అవసరం లేదు
కలలకు ఎల్లలు లేవు
మూసిన కళ్ళతో నే రోజూ
సరిహద్దు దాటి పోతా
మెహ్ది హసన్ ని కలిసి వస్తా
-- గుల్జార్
Comments
Post a Comment