మథనము

 

ఆగష్టు 29, 2023

మథనము   (mathanamu)

    అర్థము

   (విశేష్యము):  మంథనము; చిలకటము; క్షోభ

   Meaning

   (noun) : churning; stirring; agitation 

   వాడుక / Usage

అగ్నిపాలుడు ఇలా మథనపడుతున్నంతలో ప్రసేనుడు తలుపు తెరుచుకుని బయటకు వచ్చాడు.
As Agnipala was getting agitated, Prasena opened the door and walked in.

   మెదడుకు మేత / Food for thought

హృదయమా అసలు నువ్వెందుకు ఏడుస్తావు
బాధ కారుమబ్బులా క్రమ్ముకున్నప్పుడల్లా
దుఃఖం నల్లని నీడలా రెపరెపలాడినప్పుడల్లా
కన్నీరు బుగ్గలపై జాలువ్రాలినప్పుడల్లా
ఒంటరి మనసు భయపడినప్పుడల్లా
నేను మనసుని అనునయించాను
హృదయమా అసలు నువ్వెందుకు ఏడుస్తావు
ప్రపంచంలో ఇలాగే అవుతుంది
ఈ ఘాడమైన నిశ్శబ్దం ఏదైతో ఉందో
కాలం అది అందరికీ పంచింది
పిడికెడు బాధ అందరి వంతూ
చిటికెడు సూర్యోదయం అందరి వంతూ
కళ్ళు నీవి వృధాగా చెమర్చాయి
ప్రతీ క్షణం సరికొత్త ప్రకాశం
ఎందుకు నువ్వు అలాంటి క్షణాల్ని కోల్పోతావ్
హృదయమా అసలు నువ్వెందుకు ఏడుస్తావు

--దిల్ ఆఖిర్ తు క్యో రోతా హై (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి