ధారాదత్తము

 

సెప్టెంబరు 01, 2023

ధారాదత్తము   (dhārā-dattamu)

    అర్థము

   (విశేష్యము):  నీరు ధారగా పోస్తూ దానం చేయడం

   Meaning

   (noun) : solemn donation given ritually

   వాడుక / Usage

మారు మాట్లాడకుండా తన సంస్థానాన్ని అతడికి ధారాదత్తము చేయవలసి ఉంటుంది.
He would have to unquestioningly give away the dominion.

   మెదడుకు మేత / Food for thought

ఒక విషయం పెదవి గడప దాకా వచ్చి ఆపై దాటలేదు
కళ్లలోంచే తొంగి చూసింది
అపుడపుడు నీ నుంచి, ఇంకొకపుడు నా నుంచి
మాటలు కొన్ని అది వేడుకొంది
వాటిని తొడుక్కుని అధరాలు దాటి వద్దామని
గొంతుతో శృతి కలిపి కదులుదామని
కానీ ఈ విషయం ఉందే అది
అనుభవమైన ఒక అనుభవమే
గాలిలో తేలియాడే పరిమళంలాగా
గొంతులేని ఓ సువాసన లాగా
దాని ఉనికి నీకూ తెలుసు 
దాని కబురు నాకూ తెలుసు
లోకం నుంచీ అది దాగనిది
ఇది ఎలాంటి రహస్యమో

--ఏ జానే కైసా రాజ్ హై (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి