త్రుళ్ళు
ఆగష్టు 31, 2023
త్రుళ్ళు (trullu)
అర్థము
(క్రియ): గంతు; ఎగిరిపడు; గర్వించు; ఉప్పొంగు
Meaning
(verb) : to jump/leap/spring; to be arrogant/conceited
వాడుక / Usage
ఆ జవాబుకు విష్ణుమిత్రుడు తృళ్ళిపడ్డాడు.మెదడుకు మేత / Food for thought
కరిగిన ఇంద్రనీలం జాలువారే ఈ అనుభూతి
నీలి నీలి సంద్రంవంటి ఈ నిశ్శబ్దం
ఇచట నేల లేదు ఈ కడ నింగి లేదు
రెపరెపలాడే కొమ్మలూ రెమ్మలూ
గుసగుసలమని చెడుబుతున్నాయి నువ్వొక్కడివే ఉన్నావు ఇక్కడా అని
నేను మాత్రమే ఉన్నాను, నేనూ నా ఉఛ్వాసనిశ్వాసాలు నా గుండె సడులు
ఈ గహనం
ఈ ఒంటరితనం
మరియు నేను కేవలం నేను
నేను నేనుగా అవుతానని నాకు నమ్మకం కుదిరింది

--అప్నే హోనే పర్ ముజ్కో యకీన్ ఆగయా (జిందగీ నా మిలేగి దోబారా), జావేద్ అఖ్తర్
Comments
Post a Comment