అడియాస

 

సెప్టెంబరు 11, 2023

అడియాస   (aḍiyāsa)

    అర్థము

   (విశేష్యము):  అడి=అతి; అత్యాశ; అందని కోరిక

   Meaning

   (noun) : empty hope; vain or excessive desire

   వాడుక / Usage

"కానీ తన ఆశల్ని అడియాసలు చేసింది సావిత్రి".
But Savitri turned his desires into empty hopes.

   మెదడుకు మేత / Food for thought

ఈ రోజు హెగెల్ స్టార్ట్ చేస్తానన్నాడు. "వచ్చేటప్పుడు బొగ్గులు తీసుకురాకపోతే రాత్రికి వంట సున్న". బొగ్గులు...బొగ్గులు బొగ్గులంటే తనకి చచ్చే అసహ్యం. ఎప్పుడూ బొగ్గులు తెమ్మనే చెప్పింది తనతో. ఒక్కసారైనా "వచ్చేటప్పుడు మల్లెపూలు తెమ్మనో, సన్నజాజులు తెమ్మనో...పారిజాతాలో తెమ్మనో" కోమలంగా గోముగా తన హృదయం మీద వాలి చెప్పిందా? బొగ్గులు తెమ్మందే గాని, జీవితం బొగ్గులైపోయింది. అప్పుడే పది పంక్తులు చదివాడు. ఒక్క అక్షరమైనా అర్థంకాలేదు...వెధవ అబ్ స్ట్రాక్ట్ ఫిలాసఫీ..ఇప్పుడు అర్థం అవుతుందా? ఏమిటో ఆలోచనలు..
తీరిని కోరిక, అంపశయ్య నవీన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి