అకస్మాత్తు
సెప్టెంబరు 12, 2023
అకస్మాత్తు (akasmāttu)
అర్థము
(విశేషణము): హఠాత్తుగా; తటాలున; ఉన్నట్లుండి
Meaning
(adverb) : by chance; suddenly; unexpectedly
వాడుక / Usage
"ఎందుకు వనజా! అతనిమీద అకస్మాత్తుగా అంత జాలి వొలకబోసావేం?".మెదడుకు మేత / Food for thought
ఎండ...భయంకరమైన ఎండ...రోళ్లను రోకళ్ళను పగులు గొడ్తున్న రోహిణీ కార్తె ఎండ...ప్రపంచాన్నంతా నాపాం బాంబులా మాడ్చి మసిచేస్తున్న ఎండ...సమస్త ప్రాణకోటిని పెనం మీద వేయిస్తున్న ఎండ...కసిగా ఎండ ....క్రూరంగా ఎండ...కర్కశంగా ఎండ....ఎండ త్రాచుపాములా బుసకొడుతోంది. కొండ చిలువులా ఆవులిస్తోంది. పెద్ద పులిలా గర్జిస్తోంది. కార్చిచ్చులా వ్యాపిస్తోంది....ఆ ఎండలో కూచుని రంగమ్మ కంకరరాళ్ళుగా పగుల గొడ్తోంది.
ఎండ, అంపశయ్య నవీన్
Comments
Post a Comment