పునరుక్తి
సెప్టెంబరు 18, 2023
పునరుక్తి (punar-ukti)
అర్థము
(విశేష్యము): చెప్పినదే తిరిగి చెప్పడం; అలంటి వాక్య దోషం
Meaning
(noun) : repetition; tautology
వాడుక / Usage
"ఇంకా ఎందరైనా, ఎన్నిసారులైనా, పునరుక్తిదోషం పట్టని పుస్తకాలెన్నయినా వేటూరి గారి గురించి రాయవచ్చు".మెదడుకు మేత / Food for thought
మన ఈ ‘సరదా’ కేరింతల్ని కాసేపు కట్టిపెట్టి ఆయన ఏటికెదురీది, కావ్యభాషా ప్రయోగం చేసే సాహసాన్ని ప్రదర్శించి, తన పాటల ద్వారా అందించిన చక్కని చిక్కని మాటల మాధుర్యాన్ని అందుకునే ప్రయత్నాన్ని చెయ్యాలి. తద్వారా మనం భాషా రసాస్వాదనలోని మాధుర్యాన్ని చవి చూడడంతో బాటు నన్నయ్య, తిక్కన, శ్రీనాధుడు, పెద్దన, పోతన, రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య వంటి ఎందరో శారదాంశా సంభూతులకు వారసులమని సగర్వంగా మనని మనం పరిచయం చేసుకోగలుగుతాం. శ్రీ వేటూరి గారు ముందు తరాలకి దారి చూపించేలా అందించిన ఈ కరదీపిక ఆరిపోక ముందే వర్తమాన చలనచిత్రసీమ లోని కవులు, ఆంధ్ర ప్రేక్షకులూ, ఈ “ముద్దుమాటల” మరుగున పడి నిద్దరోతున్న తమ “పెద్దరికాన్ని” మేలుకొలిపేందుకు వీలుగా “రుద్రవీణ నిర్ణిద్రగానమిది అవధరించరా! విని తరించరా!” అని ‘శంకరాభరణం’లో ఆలపించిన ఆయన శ్వాసకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.
-- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో
Comments
Post a Comment