సాకల్యము
సెప్టెంబరు 19, 2023
సాకల్యము (sākalyamu)
అర్థము
(విశేష్యము): సమస్తము; యావత్తు; సంపూర్తి
Meaning
(noun) : the whole; the total; entirety
వాడుక / Usage
"వేటూరి గారి బహుముఖ ప్రతిభను సాకల్యంగా సమీక్షించిన వారి హృదయం – నవరసాల్లోనూ మునిగి తేలి, ఎంత తుడుచుకుందామనుకున్నా ఆరని ‘అద్భుత రస’ స్పర్శతో చిరకాలం ‘స్నేహం’ చేస్తుంది".మెదడుకు మేత / Food for thought
యుగళగీతమైనా, భక్తిగీతమైనా, రక్తిగీతమైనా, విరక్తిగీతమైనా, ‘ఉత్తి’ గీతమైనా – పాట…అదే సినిమా పాట ఆయన కొనవేలు పట్టుకుని కొత్త మలుపుల్లోకి నడవడం మొదలెట్టింది. మొట్టమొదటసారిగా బాణీ కట్లుబాట్లని, ‘చిత్ర’ పరిధుల్ని దాటి, తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో ఒక ‘కావ్యఖండిక’గా మనగలిగేలా పాటని నిలబెట్టి, ఎప్పటికీ వసివాడని దేవపారిజాతాల్లా, గీతాలు గుబాళించేటట్టు తన ‘భావ గంధాన్ని’ అద్ది, ఒక్కోపాట ఒక్కో ‘సంపూర్ణ కావ్యం’లా తీర్చిదిద్దడానికి ఆయన చేసిన తపస్సు, నన్ను స్తంభీభూతుణ్ని చేసిన సందర్భాలెన్నో వివరించడానికి చోటు చాలదు.
-- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో
Comments
Post a Comment