వినమ్రము

 

సెప్టెంబరు 20, 2023

వినమ్రము   (vinamramu)

    అర్థము

   (విశేష్యము):  బాగా వంగినది; చాలా వినయము; తగరము

   Meaning

   (noun) : well bent; humble; bowed; tin

   వాడుక / Usage

"వారికి నా శుభాకాంక్షలను, వినమ్ర ప్రణామాలను అర్పించుకుంటున్నాను".
I offer my best wishes and humble salutations to him.

   మెదడుకు మేత / Food for thought

మంచి ‘పలుకుబడిని’ కొందరికే పరిమితం చేయకుండా సమాజంలో అందరికీ పంచిపెట్ట గలిగిన, పంచి పెట్టవలసిన ‘వేదిక’ ఏదీ ఎక్కడా ‘మాటవరసకి’ కూడా లేక, తెలుగుభాష నిరుపేదగా మారి, నడి వీధుల్లో పడుతున్న సమయంలో, వేటూరి గారిలోని ‘వాచస్పతి’ మనకి సంస్కృతసత్సంగంతో పరిపుష్ఠమై, గాంభీర్యంలోనూ గహనత్వంలోనూ విస్తృతిలోనూ సౌందర్యంలోనూ మరే ఇతర భాషకి అందనంత ఎత్తులో ఊన్న ఆంధ్రభాషతో పునః పరిచయం కలిగించే ప్రయత్నం చేసారు. అది కూడా ప్రజాబాహుళ్యానికి చేరువగా ఉన్న వెండితెర వేదిక ద్వారా..

-- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి