ఔచితి

 

సెప్టెంబరు 21, 2023

ఔచితి   (ouchithi)

    అర్థము

   (విశేష్యము):  యోగ్యత; ఉచితము; మంచి

   Meaning

   (noun) : aptness; propriety; suitability

   వాడుక / Usage

"ఆయా చిత్రాల్లోని కథ, సన్నివేశాలు, పాత్రల ఔచితి, వగైరా సహకరించడం కూడా కారణమని అర్థమవుతుంది".
The aptness of story, scenes, characters etc in the films are also a reason.

   మెదడుకు మేత / Food for thought

‘అర్థం కావడం వేరు, అనుభూతికి అందడం వేరు’ అని తెలుసుకుంటే – ‘ఏవో కొన్ని మాటలతోనే నిత్యనైమిత్తిక వ్యవహారాలు నడిచి పోతున్నాయి కదా, ఇంకా అంత విశాలమైన భాషార్ణవం దేనికి? రండి, భాషా సాగరాన్ని ఎండగట్టి ఎడారి చేసేద్దాం’ అనుకునే విపరీత ధోరణి మానుకుంటే – మనకి అర్థం అయేలా మనకి అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తలవంచమనడం కన్నా – గొప్ప విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం
-- వేటూరి గురించి సిరివెన్నెల 2002 హాసం పత్రికలో

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

మలిసంజ